https://www.ustream.tv/flash/viewer.swf<br /><a href=”https://www.ustream.tv/&#8221; style=”padding: 2px 0px 4px; width: 400px; background: #ffffff; display: block; color: #000000; font-weight: normal; font-size: 10px; text-decoration: underline; text-align: center;” target=”_blank”>Live streaming video by Ustream</a>

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

ఆహ్వానం సరసభారతి – రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ది : 3-4-2016 ఆదివారం సాయంత్రం : 3:30నిమిషాలకు ప్రారంభం


Streaming video by Ustream

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

another live streeming link

http://www.sarasabharati.blogspot.in

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

సరసభారతి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ది : 15 – 03 – 2015 సమయం : సా|| 3.30 ని || ప్రత్యక్ష ప్రసారం

<br /><a href=”http://www.ustream.tv/&#8221; style=”padding: 2px 0px 4px; width: 400px; background: #ffffff; display: block; color: #000000; font-weight: normal; font-size: 10px; text-decoration: underline; text-align: center;” target=”_blank”>Live streaming video by Ustream</a>

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

https://www.ustream.tv/flash/viewer.swf<br /><a href=”http://www.ustream.tv/&#8221; style=”padding: 2px 0px 4px; width: 400px; background: #ffffff; display: block; color: #000000; font-weight: normal; font-size: 10px; text-decoration: underline; text-align: center;” target=”_blank”>Live streaming video by Ustream</a>

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

సరసభారతి ఉగాది వేడుకలు – ఉయ్యూరు -ది : 15 – o3 -2015 – సమయం సా|| 3.30 నిమిషాలకు

https://www.ustream.tv/flash/viewer.swf<br /><a href=”http://www.ustream.tv/&#8221; style=”padding: 2px 0px 4px; width: 400px; background: #ffffff; display: block; color: #000000; font-weight: normal; font-size: 10px; text-decoration: underline; text-align: center;” target=”_blank”></a>

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయాల్ కాంట్ -25(చివరి భాగం )

  గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయాల్ కాంట్ -25(చివరి భాగం )

సౌందర్యానికి కొలమానం ఏమిటి అన్న దానికి కాంట్ సంతృప్తి కరం గా సమాధానం చెప్పాడు .అందమైన వస్తువుకు ,కళాఖండానికి నీతి సూత్రాన్ని వర్తింప చేయ రాదు .ఇతర ప్రయోజనాలనూ ఆపాదించరాదు .వస్తువు అందం గా ఉందొ లేదో చెప్పటానికి నైతిక ,భౌతిక శాస్త్రాల కొలమానాలేవీ పని చేయవు .కళ యొక్క రామణీ యకత్వం .అనుభవైక వేద్యమే .దానిని కళా నియమాల ద్రుష్టి లోనే చూడాలి .అప్పుడే ఆనందాన్ని అనుభవించగలం అన్నాడుకాంట్ .

రామణీయకాన్ని ,కళాత్మక వస్తువును దేనికి అదే గమ్యం గా ,లక్ష్యం గా ,నిర్మమం గా ,నిర్లిప్తం గా  పరిగణించాలేతప్ప ,దాన్ని సాంఘిక ,రాజకీయ ,ఆర్ధిక ప్రయోజన ద్రుష్టి తో చూసి ,అందమైనదానిని గా భావించ రాదు .అది నిరపేక్ష రసానందం కలిగిస్తుంది కనుక రామణీ యార్ధాన్ని ప్రతిపాదిస్తోంది .కనుక సుందరమైనది .అవుతుందే తప్ప ,మరో దానికి కాదు .దాన్ని దాని కోసమే మనం ప్రేమిస్తాం .ఆస్వాదిస్తాం అంటాడు సౌన్దర్యాన్వేషి కాంట్ .

విరోదా భాసం

ఇక్కడ కూడా కాంట్ విరోదా భాసాన్ని (యాంటి నమి )ని ప్రతిపాదించాడు .రామణీ యకం వైయక్తికమే అయినా ,దానికి సార్వత్రికత ను ఆపాదించటానికి ప్రయత్నిస్తాం .అన్నికాలాలకు అన్ని దేశాలకు వర్తింప జేయాలని తహ తహ లాడుతాం .అది అందరికి ఆనందం గా ఉండాలని ,ఆనంద దాయకం కావాలని ఆశ పడతాం .మన ఆనందం లో అందరూ భాగస్వాములు కావాలని ఆరాట పడతాం .

సౌందర్యా స్వాదన వల్ల మనకు ఒకరకమైన సంతృప్తి కలుగుతుంది .ఇది ఇంద్రియ పరమైనది మాత్రమె కాదు .వైజ్ఞానిక సంతృప్తే కాదు అదొక నిర్లిప్త, నిర్మమ సంతృప్తి .సౌందర్యారాధన వల్ల  బాహ్య ప్రయోజన మేదీ నెరవేరదు .ఒకానొక మానసిక సంతృప్తి మాత్రం కలుగుతుంది .ఇది మనలో ఉన్న ఏదో లోపాన్ని పూరించటం వల్ల  కాని ,ఏదో కోరిక నేర వేరటం  వల్ల  కాని కలిగే సంతృప్తి కాదు .అది నిరపేక్ష నిరాసక్త సంతృప్తి .దానికి అదే లక్ష్యం .దీనిలో స్వార్ధం లేదు .ఏ ఇతర బాహ్య ప్రయోజనాలకు లోబడి మలినం కాని మానసిక స్తితి ఇది .కనుకనే ఈ ఆనందం మనకే కాక అందరికీ ఆనందం కలిగిస్తుంది .మన వ్యక్తిగత ఆనందానికి సార్వత్రిక ,విశ్వ జనీనత వర్తిస్తాయి .కార్య కారణ సంబంధం లా ఇది అనుభవ పూర్వం ప్రాప్తించే స్తితి .అందుకని దానికి నిస్చితత్వం ,ఆవశ్యకతా కూడా కలుగుతాయి అంటాడు కాంట్ .

సుందర వస్తువు లిచ్చే ఆనందం ఆ వస్తువులలో లేదు .మన ఆస్వాదన శక్తి లో ఉంది .ఆ శక్తి వల్లనే వస్తువు అందం గా కన్పిస్తుంది .ఆ శక్తి అందరికి ఉంటుంది కనుక అందరికి అందం గా కనీ పిస్తుందని భావిస్తాం .ఒకరికి అందం గా ఉండి  ఇంకొకరికి అందం గా లేక పోవటం ఆ వస్తువు లోపం కాదు .ఆస్వాదించే శక్తి లో తేడా మాత్రమె .అభిరుచిలో భేదం అని కాంట్ చెప్పాడు .

కాంట్ చెప్పిన సౌందర్యం లో రకాలు

సౌందర్యం రెండు రకాలు అన్నాడు కాంట్ .ఒకటి సాపేక్ష సౌందర్యం (డి పెండెంట్ బ్యూటి )-అంటే బాహ్య ప్రయోజనం మీద ఆధార పడి  ఉండేది ప్రయోజనం కలిగించే వరకే  అది సుందరం గా అని పిస్తుంది .

రెండవది కేవల సౌందర్యం (ఫ్రీ బ్యూటి ).ఇదే అసలు సౌందర్యం అన్నాడు కాంట్ మహాశయుడు .ఇది కళాఖండాలకు వర్తిస్తుంది .కళ  నిజమైన కళ  కావాలంటే అది బాహ్య ప్రయోజన రహితం కావాలి .అంటే కళ  ను కళ  కోసమే ఆస్వాదించాలి ,ఆనందించాలి అదే ‘’ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ ‘’. .దీనినే కాంట్ ‘’ప్రయోజన రహిత ,ప్రయోజనాత్మకత ‘’(పర్పస్ లెస్ ,పర్పసివ్ నెస్ )అన్న పేరుతొ పిలిచాడు .

మరి ప్రయోజనం లేకుండా ఎవరూఎపనీ చేయరని మనకు తెలుసు .కళా ఖండాల కళాత్మకత ( ఆర్టి స్ట్రి)దాని నైతిక భౌతిక , సాంఘికాది ప్రయోజనాల్లో లేదు .దాని కేవల రామణీయకతలోనే ఉంది .అది అనుభవైక వేద్యం మాత్రమె .దానికి కొలమానాలూ సూత్రాలు వేరు గా ఉంటాయి .

కాంట్ ఏ అతీత దృక్పధం తో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడో లోతుగా అధ్యయనం చేస్తే కాని తెలియదు .కళాత్మక వస్తువులకు ,సాహిత్యానికి ప్రయోజనం ఉండదని ,ఉండరాదని కాంట్ ఏమీ చెప్పలేదు .అనైతికం (ఇమ్మొరల్ ),అసత్యం (అన్ ట్రూత్ ఫుల్ )అయినా ,కళా ఖండాలను ఆదరించాలి .,ఆస్వాదించాలి అని కూడా అర్ధం కాదు క ళ లోని సౌందర్యం ,దాని నైతికత (ఎధికాలిటి ) లో కాక సత్య ప్రామాణీ కత (ట్రూత్ ఫుల్ నెస్ )లోకాక ,తనకు తానే ప్రయోజన కరమైన ఆనందం కల్గించే లక్షణం లో ఉంది అది అన్నింటికీ అతీతం (ట్రా న్స్సేన్ డెంట్ ).గా ఉంటుందని అర్ధం చెప్పాడు కాంట్ .

కళ కు ,కళాత్మకత కు ,కళా సౌందర్యానికి సాంఘిక ప్రయోజనాన్ని మించిన అతీత ప్రయోజనం ఉంది .అదే ‘’పర్పస్ లే పర్ప సివ్ ‘’.అప్పుడే అది కళా ఖండం అని పించుకొంటుందని గొప్ప భాష్యం చెప్పాడు భాస్యకారుడు కాంట్ .కళా సౌందర్యానికి కళా సౌందర్యమే లక్ష్యం ,మరియు ప్రయోజనం కూడా .ఈ దృష్టితోనే కావ్యాలను నాటకాలను ,సంగీతాన్ని ఇతర కళలను ,సాహిత్యాన్ని అవగాహన చేసుకోవాలి .అని సౌందర్య చర్చలో కాంట్ చివరి తీర్పు నిచ్చాడు

ఈవిదం గా ఇన్ని రకాలుగా వేదాంత ,తాత్విక విజ్ఞాన గణిత తాలను తన  మేధా సంపత్తి చేత ప్రభావితం చేసిన దార్శనికుడు ,మేధావి, మాననీయుడు ,మహా వ్యక్తీ ఉత్తమ సంస్కారం తో ఎందరికో ప్రేరణ కలిగించిన జర్మన్ రుషి ఇమాన్యుయల్ కాంట్ .ఆ మహాను భావుడి గురించి చదివి తెలుసుకొని నాకు అర్ధం అయిన విషయాలను నాకోసమే నేను రాసుకొన్నా, ఆయన పై ఆసక్తి గల వారికి ఇది ఉపయోగ పడుతుందనే నమ్మకం తో ధారా వాహిక గా రాసి మీ అందరికి అందించాను .ఇందులో దోషాలన్నీ నావి నా అవగాహనా రాహిత్యానివి .మంచి అంతా అ కాంట్ మహాశయుడీది ,ఆయన్ను ఆవిష్కరించిన విశ్లేష కులైన మేదావులదీ .అందరికి వందనాలతో సెలవ్

సంపూర్ణం

ఈ బృహత్ వ్యాసానికి   ఆధార భూత మైన  రచనలు -రచయితలు

1-Kant –Scruton

2-On Kant –Garrelt Thomson –the words worth philosophical series

3-The philosophers –Ted Hand

4-Basic writings of Immanuel Kant

5-Pure reason –Kant

6-Kant a biography –Manfred Kuehin

7- Encyclopaedia Britanica

8-కాంట్ తత్త్వం –వాడ్రేవు చిన వీర భద్రుడు

9-విశ్వ దర్శనం –నండూరి రామ మోహన రావు

10-విజ్ఞాన సర్వస్వం

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు -సరసభారతి 49 సమావేశం -27-8-13

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు -సరసభారతి 49 సమావేశం -27-8-13

 

100_9153 100_9154 100_9155 100_9156 100_9157 100_9158 100_9159 100_9160 100_9161 100_9162 100_9273

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

గణిత విజ్ఞాన వేదాంత తత్వశాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -24

గణిత విజ్ఞాన వేదాంత తత్వశాస్త్ర  కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -24

మనుష్యుడిలమహాను భావుడే

ప్రతి  వాడూ  లేకం లో తనకు తాను ఇచ్చుకొనే విలువనీ ,ఇతరులు కూడా తమకు తాము ఇచ్చుకొంటారు అని అందరం గ్రహించాలి .ప్రతి వ్యక్తీ గమ్యం తానే .అని అర్ధం చేసుకోవాలి ..తన వ్యక్తిత్వ సాక్షాత్కారమే అని తెలుసుకోవాలి ..ఎవడూ ఇంకోడికి సాధన మాత్రుడు కాదు .తాను తప్ప మరి ఏ ఇతర ప్రయోజనానికి నిమిత్త మాత్రుడు కాదు .ఎవడి వ్యక్తిత్వం ప్రత్యేకతా వాడిదే .అందుకని మనం  ఇచ్చుకొనే విలువ ,గౌరవం ఇతరులకు కూడా ఇవ్వాలి .ఇదే నైతిక  ప్రవర్తనకు ఆధార సూత్రం కావాలి .దాన్ని ఆచరణలో చూపించాలి .కాంట్ దీనిని ఈ విధం గా చెప్పాడు –

‘’మానవ జాతి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అంటే-నీతో సహా ,మనలో ప్రతి ఒక్కరి తో సహా మొత్తం మనవ జాతిని ,ప్రతి ప్రత్యెక సందర్భం లోను ,దాని కొరకే దాన్నిగా తప్ప ఏ ఇతర ప్రయోజనానికి సాధన మాత్రం గా మనం  పరిగణించ  రాదు (treat humanity whether in thineown person or in that of any other .In every casae as an end withal ,never as a means only )

మనతో సహా ప్రతి ఒక్కడూ తనకు తానే గమ్యం అని బావించాలి .దీని వల్ల  సర్వ మానవ సమానత్వం అనే విశ్వ జనీన సత్యం ఆవిష్కృత మౌతుంది .ఇదే మన ఉపని షత్తు  చెప్పిన ‘’ఆత్మ వత్ సర్వ భూతాని ‘’.ఇంకొంచెం ముందుకు వెడితే ‘’యస్తు  సర్వాణి భూతాని ,ఆత్మన్యవాను పశ్యతి ,సర్వ భూతేషు చాత్మానం తతో న విజుప్సతే ‘’అంటే ఎవరైతే తనలో సర్వ ప్రాణులను ,సర్వ ప్రాణులలో తననూ చూసుకొంటాడో వాడికి దుఖం అనేది లేదు ‘’అందుకే భారతీయ తత్వ వేత్తలకు కాంట్ అంతగా ఆదరణీ యడయ్యాడు .పాశ్చాత్య తత్వ వేత్తలలో నిరపేక్ష ,సార్వత్రిక నైతిక ప్రవర్తన సూత్రం (కేట గారికల్ ఇంప రేటివ్ )ను ఆవిష్కరించి ,అందరి కంటే ముందు చూపుగల వాడయ్యాడు కాంట్ .మార్గ దర్శనం చేశాడు వారందరికీ .ఈ సూత్రం ఉదాత్త సౌందర్యం తో భాసిస్తుంది .పాశ్చాత్య వేదాంతానికి క్రాంత దర్శి కాంట్ మహాశయుడు పెట్టిన ధర్మ భిక్ష ఇది .

ధర్మ సూత్రాలు ప్రతి నీతి సూత్రాన్ని బాధిస్తాయి .అప్పుడు సూత్రాలు సంఘర్షించి నట్లుగా అని పిస్తుంది .అప్పుడు ఏమిటి గతి ?ప్రత్యెక సన్ని  వేశా లలోఅందరూ ఎలా ప్రవర్తిస్తే  నీతి అవుతుందని మన అంతర్వాణి ఉద్బోదిస్తుందో ,ఆ విధం గా చేయటమే కర్తవ్యమ్ అవుతుంది .దానిలో స్వార్ధం లేనంత వరకు దోషం మనలను బాధించదు  .అంటే సందర్భానికి తగిన నీతిని ఆవిష్కరించి సమాజ శ్రేయస్సుకు దోహద పడాలి అన్నదే కాంట్ భావించిన కే ట గారికల్ ఇమ్పరేటివ్ పరమార్ధం అని అందరు గ్రహించాలి

కాంట్ రామణీయక సిద్ధాంతం

కాంట్ రాసిన మూడవ పుస్తకం ‘’దిక్రిటిక్ ఆఫ్ జడ్జ్ మెంట్ ‘’.ఇది ‘’సౌన్దర్య మీమాంస’’ (Aesthetic logic )కు సంబంధించింది .వస్తువు బాహ్య ద్రుష్టి లోనైనా ,కళా ద్రుష్టి లో నైనా సుందరమైనదో కాదో ఎలా తెలుస్తుంది ?సౌందర్యా స్వాదనను ఎలా చేయగలం ?మొదలైన విషయాలను చర్చిన్చేదే ఈస్తటిక్స్ అంటే ..మన  అలంకార శాస్త్రం లాంటిది .ప్లేటో, అరిస్టాటిల్ ,లు పూర్వం దీన్ని గురించి చర్చించారు ..కానీ ఆ తర్వాతి యూరోపియన్ తత్వ వేత్తలుదీన్ని పట్టించుకోకుండా వదిలేశారు .వీళ్ళ తత్వ చర్చ అంతా పార భౌటిన ,నైతిక చిన్తనలకే పరిమితం చేశారు .మళ్ళీ ఇన్నేళ్ళకు కాంట్ దీనిని తీసుకొని రామణీ యకత్వం పై అద్భుత మైన చర్చ చేశాడు దాని పై ఒక దివ్య గ్రందాన్నే రాశాడు .అందుకే కాంట్ ను ‘’ఆధునిక రామణీయక శాస్త్ర పితామహుడు ‘’అన్నారని నండూరి రామ మోహన రావు గారన్న మాట అక్షర సత్యమే .

కాంట్ రాసిన మూడు పుస్తకాలైన ‘’క్రిటిక్ ‘’లో మొదటి దానిలో’’ సత్యం ‘’(ట్రూత్ )గురించి చర్చించాడు .రెండవ క్రిటిక్ లో ‘’శివం’’( ది గుడ్)ను గురించి చర్చిస్తే మూడవ దానిలో ‘’సుందరం ‘’(దిబ్యూటిఫుల్ )గురించి చర్చ చేశాడు .అంటే’’ సత్య శివ సుందర త్రికం’’ గురించి మీమాంస చేసిన ఘనా ఘనుడు కాంట్ .కాంట్ కాలం నుంచే తత్వ శాస్త్రం లో ‘’రామణీయకత ‘’పై చర్చ ఒక ముఖ్య భాగమై పోయింది అదీ కాంట్ ప్రత్యేకత .సత్య ,శివ, సుందరాలు దేనికి అదే ప్రత్యెక మైనది కీట్స్ కవి‘’సత్యం సౌందర్యం ఒకటే ‘’అన్నాడు ‘’an ode on Gracian Arn ‘’కవిత లో –‘’beauty is truth ,truth beauty –that is all ye ,know on earth ,and all e need to know ‘’చెప్పాడు .

అయినా ఆ ప్రతిపాదన అందరికీ అంగీకారం కాలేదు .కారణం సత్యం విషయం నీతి మంతం శుభకరం కాక పోవచ్చు .నైతిక మైనంత మాత్రాన సత్యమైనది కాకనూ పోవచ్చు .సత్య విషయం సుందరం నీతి మంతం కాకనూ పోవచ్చు .సుందరమైనది ప్రతిదీ నైతికం సత్య నిష్టం కాక పోవచ్చు .కనుక ఈ మూడూ విభిన్న సూత్రాలే .సత్యం అందరికీ సత్యమే .అది సార్వత్రిక సార్వ జనీన మైనది .నైతిక సూత్రం మానవు లందరికి ఒకటే .నీతి అందరికి నీతి అవ్వాలి .అదీ సార్వత్రికం సార్వ జనీనం

వ్యక్తీ అనుభూతి

సుందరమైనది అందరికి సుందరం అని పించక పోవచ్చు అందమైన వస్తువు కలిగించే సంవేదన (ఫీలింగ్ )మిగిలిన వాటి కంటే భిన్నం గా ఉంటుంది .దానికి అదే లక్ష్యం గమ్యం .అది ఏ ఇతర సంవేదనకూ కారణం కాదు .అందానికి ఆనందమే పరమావధి అందమైనది అనైతికం అసత్యం కావచ్చు కూడా .అయినా అది అందమైనదే అని పిస్తుంది .మరి దీనికి కొలమానం ఏమిటి ? ఈ ప్రశ్నను సంధించుకొని కాంట్ గొప్పగా దాన్ని ఆవిష్కరించాడు .ఆ విషయాలు తర్వాత తెలుసు కొందాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –27-8-13 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -23

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -23

నిర్ణయ స్వేచ్చ

మనం చేసే పనులు రెండు రకాలుగా ఉంటాయన్నాడు కాంట్ .కోరికలు ,ఉద్రేకాలు ,ఉద్వేగాలకు లోనై చేసే పనులు మొదటి రకం .కర్తవ్య నిష్ట   తో చేసేవి రెండో రకం .మొదటి వానిని స్వేచ్చగా చేయం .వాటికి బయటి వాటి ప్రేరణ ఉంటుంది .అలా చేయటం వల్ల  సుఖం ,ప్రయోజనం ,లాభం కలుగుతాయని చేస్తూంటాం .ఇందులో మనకు ‘’సంకల్ప స్వేచ్చ ‘’వ్యక్తం కాదన్నాడు కాంట్ .

మనిషి సంకల్ప స్వేచ్చ వ్యక్తమయ్యే పనులు కొన్ని ఉంటాయి .అవి కర్తవ్య పాలన గా చేసే పనులు .ఏ పని అయినా అది మన విధ్యుక్త ధర్మం అని భావించి చెయ్యాలి .అందులో స్వార్ధం ఉండరాదన్న్నాడు కాంట్ మహాశయుడు .ఇలా చేస్తే సంకల్ప స్వేచ్చ ఎక్కడిది ? /అని ప్రశ్న రావటం సహజమే .మన అంత  రాత్మ ప్రబోదిన్చినపుడు దాన్ని మన ఇస్టా నిస్స్టాలతో సంబంధం లేకుండా ఆచరించటానికి నిర్ణయించుకోవటం లోనే మన నిర్ణయ స్వేచ్చ (ఫ్రీ విల్ )వ్యక్తం అవుతుంది .అది మన కర్తవ్యమ్ అని ,విధ్యుక్త ధర్మం అని ,దాన్ని స్వేచ్చగా ఎంచుకొంటాం .అలా ఎంచుకోకుండా ఉండే స్వేచ్చ మనకు ఎలాగూ ఉంది .కాని అది కర్తవ్యమ్ అని ఎంచుకోన్నాం కనుక ఉత్తమ కార్యం ,నైతిక కార్యం అని పించుకొంటుంది అన్నాడు ‘’కాంట్ ది గ్రేట్’’.

కాంట్ గారి కాటగారికల్ కల్ ఇంప రేటివ్

సాధారణ పనులను బాహ్య ప్రేరణలకు లోనై విదిగాచేస్తాము .అవి బాహ్య ప్రేరణల చేత నియంత్రితం అవుతాయి .ఇవి కాక నైతిక చర్యల్ని ,కర్తవ్యమ్ చేయించే పనుల్ని మనకు నిరాకరించే స్వేచ్చ కూడా ఉన్నప్పటికీ ,అవి కర్తవ్యాలు కనుకనే చేస్తాం .అందుకే అవి నైతిక చర్యలు అయ్యాయి .ఈ కర్తవ్య పాలనను ,విధ్యుక్త ధర్మ నిర్వహణ ను కాంట్ ‘’కాట గారికల్ ఇంప రేటివ్ ‘’అంటే ‘’నిరపేక్ష కర్తవ్యమ్ ‘’అన్నాడు .ఈ పేరు పాస్చాస్చ తత్వ శాస్త్రం లో బాగా సుప్రసిద్ధమైంది .ఏ ప్రయోజనాన్నీ ఆశించకుండా ,చేస్తామో ,చేయ దగింది అని భావించి చేస్తామో అదే నిరపేక్ష కర్తవ్యమ్ .కర్తవ్యానికి కర్తవ్యమే ప్రయోజనం .స్తల కాలాలతో బాహ్య కారణాలతో దీనికి సంబంధమే లేదు .ఒక విశ్వ జనీన నైతిక సూత్రాన్ని అనుసరించి అది నిర్ణయం అవుతుంది .దాన్ని ఆచరించటం ద్వారా మనం పరమ సత్యం యొక్క అవగాహనకు మరింత దగ్గర అవుతాం అని నమ్మకం గా కాంట్ చెప్పాడు .

అయితే ఏది కర్తవ్యమ్ ?ఇది అడుగడుగునా వచ్చే ధర్మ సందేహమే .ఏది కర్తవ్యమో ఎలా చెప్పగలం?ఎవరు చెప్పాలి ?ధర్మ సంకటం  వస్తే పార్దుడికి పార్ధ సారధి శ్రీ కృష్ణుడు కర్తవ్య బోధ చేశాడు .ప్రతి నిత్యం మనకు ఎవరు చేస్తారు ?ఉషశ్రీ లేడు,మల్లాది వారు వారానికో నెలకో సారో టివి.లలో దర్శనమిస్తారు .కనుక కిం కర్తవ్యమ్ ?అంతరాత్మ చెప్పి నట్లు చేయటమే కర్తవ్యమ్ అన్నాడు కాంట్ .అంతకు ముందెప్పుడో మన వాళ్ళూ ఇదే చెప్పారని మనకు తెలిసిన విషయమే .కనుక అంతరాత్మ చెప్పి నట్లు నడచుకోవాలి .ఏది చేస్తే లోక కల్యాణం జరుగుతుందో దాన్ని మాత్రమె చేయాలి .మనిషి మనిషికి ఒక నీతి సూత్రం ఉండరాదు .సమస్య వస్తే మనం ఎలా ప్రవర్తిస్తామో ,ఇతరులు ఎలా ప్రవర్తిస్తే అందరికి మేలు జరుగుతుందో ,నీతి అవుతుందని భావిస్తామో ,మనం కూడా అలా ప్రవర్తించాలి ఉత్కృష్ట కర్తవ్యమ్ .అంటే విస్తృత ప్రయోజనం చాలా ముఖ్యం అన్న మాట .మనం నిర్దేశించుకొనే కర్తవ్యమ్ ,ఒక విశ్వ జనీన నైతిక సూత్రం అవటానికి అర్హమై ఉండాలి అని కాంట్ నిక్కచ్చిగా బోధించాడు .

మనకు ఒకడి పై ద్వేషం కలిగి ,వాడికి హాని తల పెడితే ,లోకం లో అందరూ అలానే ప్రవర్తిస్తే లోకం భ్రష్ట మై పోతుంది .ఇలా అయితే సహజీవనం ,సంఘ జీవనం సాధ్యం కాదు అని స్పష్ట పరచాడు కాంట్ .కనుక ఇతరులను ద్వేషించటం హాని కల్గించటం విశ్వ శ్రేయస్సు దృష్ట్యా చేయరాని పని .అలాగే అబద్దాలాడటం చేయరాదు .మోసం అసలు కూడదు .కనుక నిజాయితీ గా మన కర్తవ్య పాలన చేస్తే లోక శుభం కలుగుతుంది .’’సర్వే  జనా స్సుఖినో భవంతు ‘’అని చెప్పిన మన ఉపనిషద్ వాక్యమే కాంట్ తన భాషలో చెప్పాడని తెలుస్తోంది .కర్తవ్యమ్ విశ్వ జనీన సూత్రాన్ని బట్టే నిర్ణయం అవుతుంది .’’ఇతరులు ఏ పని చేస్తే ,అది మనకు హితం గా ఉండదో ,ఆ పని ఇతరులకు చేయక పోవటం అన్ని ధర్మాలలో ఉత్తమ ధర్మం ‘’అని మహా భారతం లో చెప్పిన సూత్రమే ఇమాన్యుయల్ కాంట్ తాత్వికుడుగారి  ‘’కాట గారికల్ ఇంప రేటివ్ ‘’.గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పినట్లు ‘’కర్మలు చేయటం మన వంతు .కర్మ ఫలాల పై మనకు అధికారం లేదు‘’.అయితే పని అంటే మన ఇష్టం వచ్చినట్లు చేసే పని కాదు .’’కర్తవ్యమ్ ‘’అని గుర్తుంచుకోవాలి .ఇందులో విశ్వ జనీనత ఇమిడి ఉంది .

కాంట్ చెప్పిన అతీత సత్యం

‘’కంటికి కనిపించే ఈ వస్తు ప్రపంచం వెనక ,దేశాకాలా బాధిత మైన ఒక సత్యం అవాగ్మానస గోచరం గా ఉంది .మన నైతిక సంకల్ప స్వేచ్చ ను ఉపయోగించుకొని ,నిరపేక్ష కర్తవ్య నిర్వహణ ద్వారా ఆ సత్యాన్ని కొంత వరకు మనం దర్శించగలం అన్నాడు కాంట్ .మన కర్తవ్యమ్ విశ్వ జనీనం ,దేశ కాలా బాధితం కనుకనే ఇది వీలవుతుంది .అంతే కాదు అనుభావాత్పూర్వ అనుభా తీతం కూడా . ఈ పరిస్తితులలో  దేశాకాలా బాదితమైన ఆ పరమ సత్యం తనను తాను అభి వ్యక్తం చేసుకొంటుంది ‘’అని కాంట్ పండితుని అభిభాషణం .మన వేదాంత దర్శనమూ ఇదే కదా .ఇలాంటి కర్తవ్య నిర్వహణ లోక కల్యాణాన్ని కోరుకొంటుంది కనుక అది ఆవశ్యకమైనది అవుతుంది .,అనుసరణీయం ఆచర ణీయం అవుతుంది ఇదే కాంట్ గారి కట గారికల్ ఇంప రేటివ్ .మరి దీనికి పర్యవసానం ఏమిటి ?సర్వ సమానత్వం .అంటే ప్రజాస్వామ్యం .సోషలిజం ‘’.నైతిక దృష్టిలో ఎవడూ ఎవడి కంటే గొప్ప కాదు .సార్వ కాలీన ,సార్వ జనీన నీతి సూత్రం ముందు ఎవడైనా ,ఆఖరికి దేవుడైనా తల వంచాల్సిందే ‘’అని నిశ్చయం గా చెప్పాడు సమ సమాజ దర్శనుడు ,మహా వేదాంతి కాంట్ మహాశయుడు . .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-13 ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 1 వ్యాఖ్య